పెనుమంట్ర జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

ఆచంట: జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా పెనుమంట్ర మండలం, పొలమూరు గ్రామ పంచాయతీ పరిధిలో జగనన్న మోసం ఇళ్ల స్థలాల స్కాం.. ఇళ్ల స్థలాల భూమి కొనుగోలు నుండి లబ్ధిదారుల ఎంపిక వరకు ప్రతి చోట వైసీపీ నాయకులు అవకతవకలు జరిపినది వాస్తవం. స్థలాల కొనుగోలు వ్యవహారం జరిగిన వైనం, వైసీపీ నాయకుల వర్గానికి చెందిన వ్యక్తులకు ఆర్ధిక లబ్ది చేకూరే విధంగా జరిగిన లావాదేవీలు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంలో లేని పారదర్శకత, పేదలకు ఉచిత ఇల్లు అన్న వైసీపీ ప్రతి లబ్ధిదారుల నుండి 20000 రూపాయలు వసూలు. అర్హత ఉంది 20000 కట్టలేని పేద వారికి మొండి చెయ్యి. అర్హత లేని వారికి మాత్రం 20000 కడితే ఇళ్ల స్థలాల కేటాయింపు. కనీస మౌళిక సదుపాయాలు లేక నిర్మాణాలు చెయ్యడం లేదు ప్రారంభమైన ఒకటి రెండు నిర్మాణాలు కూడా ఆగిపోవడం వల్ల గడ్డి మొక్కలతో ములిగిపోయిన పరిస్థితి. ఈ ఇళ్ల స్థలాల వ్యవహారం పై పూర్తి స్థాయి సోషల్ ఆడిట్ జరిపి స్థలం రాని అర్హులకు అండగా, అర్హత ఉంది 20000 కట్టించుకున్న వైసిపి ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా మరియు అర్హత లేకున్నా స్థానాలు ఎలా మంజూరు చేశారు అనే అంశాలపై నివేదిక సిద్ధం చెయ్యనున్నామని తెలియజేయడం జరిగింది.