నిరుద్యోగ నిరసన దీక్షకు జనసేన మద్దతు

గాజువాక: విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో గల పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమలలో ఉపాధి కల్పించడంతో పాటు పనిచేస్తున్న వారికి పిఎఫ్, ఈఎస్ఐ సి తక్షణమే చెల్లించి ఉద్యోగ భద్రత కూడా కలిపించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ పశ్చిమనియోజకవర్గం సమన్వయ కర్త మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి అంగ దుర్గ ప్రశాంతి ఆధ్వర్యంలో శుక్రవారం “నిరుద్యోగ నిరసన దీక్ష” చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, విశాఖపట్నం అర్బన్ జిల్లా సమన్వయకర్త కోన తాతారావు, విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, చోడవరం సమన్వయకర్త పీవీఎస్ఎన్ రాజు, 22 వ వార్డు కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్, ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోర్డినేటర్ శ్రీమతి నాగలక్ష్మి, శ్రీమతి సారిని దేవి మరియు పెద్ద ఎత్తున జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు మద్దతు తెలిపారు. అనంతరం విశాఖ అర్బన్ జిల్లా సమన్వయకర్త కోన తాతారావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు.