ప్రత్తిపాడులో టీడీపీ పాదయాత్రకు జనసేన సంఘీభావం

ప్రత్తిపాడు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ టీడీపీ పార్టీ నాయకులు ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ వరుపుల సత్యప్రభ రాజా ఏలేశ్వరం పట్టణం బాలాజీ చౌక్ పోస్ట్ నుండి యర్రవరం వరకు చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తూ పాదయాత్ర చెప్పట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో జనసైనికులు మరియు జనసేన నాయకులు టీడీపీ వారికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.