టీటీడీ సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు

తిరుపతి: టీటీడీ సులభ్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు తెలపడం జరిగింది. వివరాలలోనికి వెళితే తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కాంట్రాక్ట్ కార్మికులు దాదాపు 3000 మంది 20, 10, 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారికి రోజు కూలి 360 రూపాయలు చెల్లిస్తున్నారు. వీరందరికీ నెలకు 11,000 రూపాయలు వస్తుంది, దానిని 8000 రూపాయలకు తగ్గిస్తాం అని చెప్పడంతో కలత చెంది నిరసన తెలుపడానికి ఇస్కాన్ ఎదురుగా ఉన్న మైదానంలో సుమారు 3000 మంది తమ డిమాండ్ లను పరిష్కరించాలని ప్రజాస్వామ్య బద్దంగా నిరసన చేస్తున్నారు. వీరి మొదటి డిమాండ్ కార్పొరేషన్ లో జాయిన్ చేయాలి, వీరి జీతం 17,000 వేలకు పెంచాలి, ప్రతి నెల 4 రోజులు సెలవు దినంగా ప్రకటించాలి, నలుగురు చేసే పనిని ఇద్దరికి చెప్తున్నారు, వీళ్ళకి జనరల్ దర్శనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి, ఇంతకముందు వీరికి లడ్డు కూడా ఇచ్చేవారు అది కూడా ఇవ్వాలి, వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదు కరోనా సమయంలో చాల మంది చనిపోయారు, వాళ్ళ ఉద్యోగాలని వాళ్ళ పిల్లలకు ఇవ్వాలంటూ నిరసన తెలుపుతున్న వీరికి మద్దతుగ జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బత్తిన మధు బాబు, తిరుపతి నియోజకవర్గ ఇంచార్జి కిరణ్ రాయల్, తిరుపతి నగర అధ్యక్షుడు రాజా రెడ్డి, తిరుపతి నగర ఉపాధ్యక్షుడు పార్ధు, మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కార్మికులకు న్యాయం జరిగేలా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేసారు. గతంలో టీటీడీ కాంట్రాక్ట్ ఎఫ్.ఎం.ఎస్ కార్మికులకు అండగా నిలిచాం. అలాగే ఇపుడు మీకు అండగా ఉంటాం కానీ మీరు గట్టిగ నిలబడితే మేమంతా మీ పక్కన నిలబడతాం, మీ పైన లాఠీ పడాలంటే ముందు మా మీద పడాలి అని తెలియజేశారు. జనసేన పార్టీ మీ అందరికి అండగా ఉంటుందని డా.పసుపులేటి హరిప్రసాద్ వివరించడం జరిగింది, జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ నుండి కూడా మద్దతు ప్రకటించేలా కృషి చేస్తామని చెప్పడం జరిగింది.