గెలుపే లక్ష్యంగా జనసేన-టిడిపి ఉమ్మడి ప్రణాళిక: యుగంధర్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలం, బాలకృష్ణాపురం పంచాయతీ, బాలకృష్ణాపురం హరిజనవాడ, బాలకృష్ణాపురం, ఆముదల పుత్తూరు గ్రామాలలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆదేశాలు మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ గెలవడమే లక్ష్యంగా జీఎస్పీ టిడిపి ఉమ్మడి ప్రణాళిక అని తెలిపారు. సరికొత్త ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి, సంపద సృష్టించి, సంక్షేమ పాలన అందించడమే మా ధ్యేయమని ఉద్ఘాటించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆలోచన, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అత్యవసరమని తెలియజేసారు. భవిష్యత్ గారంటీ లోని అంశాలను ఇంటింటికి వెళ్లి తెలియజేసారు. వైసిపి పాలనలో ప్రజలు సుభిక్షంగా లేరని, అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం విజయకేతనం. ఎగరేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, ఉపాధ్యక్షులు రాఘవ, వాసు నాయుడు, కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, బాలకృష్ణాపురం పంచాయతీ అధ్యక్షులు హేమంత్, పాల్రాజ్, మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కోదండ, నాయకులు శేఖర్, నరేష్, హరీష్, శేఖర్, జనసైనికులు పాల్గొన్నారు.