పెద్ద తరిమి గ్రామంలో గడపగడపకు జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం, నెల్లిమర్ల మండలం, పెద్ద తరిమి గ్రామంలో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి గడపగడపకు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటూ నియోజకవర్గంలో చేస్తున్న పలు కార్యక్రమాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేసి జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుకి వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలిపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.