వినూత్న ఆలోచనలతో సమస్యల పరిష్కారం దిశగా జనసేన

సమస్యలు పరిష్కారం కోసం జనసేన ఎప్పుడు కొత్త పంధా లో వెళ్తుంది. దానికి తగ్గట్టుగా జనసేన సోషల్ మీడియాలలో తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ముక్యంగా ఉన్నటువంటివి మీడియా, ప్రింట్ మీడియా, సోషల్
మీడియా

ప్రస్తుతం సోషల్ మీడియా నే ప్రదానం ఉన్న తరుణంలో మరియు జనసేన కి ముక్యంగా యువత ఎక్కువ ఉన్నారు కనుక జనసేన సోషల్ మీడియా నే అస్త్రంగా సమస్యలు పరిష్కారానికి వేదికగా చేసుకుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన పార్టీడిజిటల్ ఉద్యమం చేపట్టింది. మూడు రోజుల పాటు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేయటం జరిగింది. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడాలని వైసీపీ, టీడీపీ ఎంపీలను ట్విట్టర్లో ట్యాగ్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఎంపీలకు బాధ్యత గుర్తు చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన డిజిటల్ కాంపెయిన్ కు విశేష స్పందన లభించింది.

డిజిటల్ క్యాంపెయిన్ అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చేసే ప్రతి ట్వీట్లో #raise_placards_andhra_mp అనే హ్యాష్ ట్యాగ్ వాడి లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడికి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్ చేయాలని వినూత్న నిరసనతో జనసేన చేసిన కాంపెయిన్ కి మొత్తం 6౦౦ మిలియన్ ల యాస్టాగ్ తో విపరీతమైన స్పందన లభించింది.

స్టీల్ ప్లాంట్ డిజిటల్ క్యాంపెయిన్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై డిజిటల్ యుద్ధం చేసింది జనసేన . రోడ్ల అధ్వాన స్థితిని ఎండగట్టేందుకు నిర్ణయించుకుని శ్రమదానం చేసి మరీ రోడ్లు బాగు చేయాలనీ పిలుపునిచింది.‘గుంతలు పడ్డ రోడ్ల మీద ప్రయాణం చేసి రోజు చాలా మంది యాక్సిడెంట్లకు గురై పిల్లలు, మహిళలు, వృద్ధులు గాయాలపాలై ఆస్పత్రిలో చేరటం, మరికొంతమంది చావు దగ్గర వరకు వెళ్లి తిరిగిరావటం జరిగింది. ఇవన్ని చూసి ఆవేదన తో రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి
తద్వారా ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై #JSPFORAPROADS ద్వారా ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ, ఊరు బాగుకోరే ప్రతి ఒక్కరు పాడైన రోడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలనీ వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందాం. రోడ్లను బాగు చేసే శ్రమదానం కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని
అవుతాను’’ అని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునివ్వటం జరిగింది. .అందులో బాగంగా స్వయంగా జనసేనాని రాజమండ్రి లో స్వయంగా శ్రమదానంచేయటం జరిగింది.

ఏ సమస్య అయిన ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికీ తీసుకెళ్ళి , తరువాత సమస్యను పరిష్కరించే విదంగా సమస్యపై పోరాటం జరుగుతుంది. ఆలా చేసిన పోరాటం లో రోడ్ల శ్రమదానం జరిగిన తరువాత ప్రభుత్వం స్పందించటం జరిగింది.

జనసేనాని అడుగుజాడల్లో కొందరు నాయకులూ కూడా తమదైన శైలిలో వినూత్నం సమస్యలు అదికార ఎమెల్యే లకు తెలిసేలా చేయటం జరుగుతుంది.

సమస్య ఎక్కడ ఉందో… పరిష్కారమూ అక్కడే వెతకాలి.. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రబోధం ఇది.. ఎక్కడి ప్రజలు సమస్యల్లో ఉంటే అక్కడే పరిష్కార మార్గమూ అన్వేషించాలనేది దాని భావం. జనసేన కార్యకర్తలు చాలా సందర్భాల్లో వివిధ రూపాల్లో ఆయన మాటలకు ఆచరణ రూపం కూడా ఇచ్చారు. అధ్యక్షుని మాటలకు ఓ కొత్త ఒరవడిలో రూపం ఇస్తూ… ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు (చినబాబు) ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజల పక్షాన
ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో మరో ముందడుగుకు నాంది పలికాయి. శ్రీ చినబాబు భీమవరం శాసనసభ్యుడిని ప్రశ్నించిన తీరు, తదుపరి చోటు చేసుకున్న సంఘటనలు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ డొల్లతనాన్ని ఎత్తిచూపాయి.

జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు(చినబాబు) స్థానిక శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ ముందు ఓ విన్నపాన్ని ఉంచుతూ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. భీమవరం పట్టణంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందనీ, గత ఏడాది(2020) జనవరిలో శంఖుస్థాపన చేసిన పనుల్లో పురోగతి లేదన్న విషయాన్ని ప్రజల ముందు ఉంచడం ఆ ఫ్లెక్స్ ముఖ్య ఉద్దేశ్యం. ఆయన ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్స్ లో భీమవరం పట్టణ కౌన్సిల్ పరిధిలో ఆమోదం పొందిన టెండర్ పనుల నిమిత్తం డైలీ మార్కెట్ వద్ద మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి 2020 జనవరి 10వ తేదీన, వివిధ వార్డుల్లో
తారు మరియు సిమెంటు రోడ్ల నిర్మాణానికి 2020 జనవరి 7వ తేదీన స్థానిక ఎమ్మెల్యే శంఖుస్థాపన చేశారు. ఏడాది దాటినా వాటికి సంబంధించి పనుల్లో మాత్రం పురోగతి లేదు. 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదున్న విషయాన్ని ఫ్లెక్స్ సాక్షిగా శ్రీ చినబాబు ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటంలో నూతన ఒరవడికి నాంది పలుకుతూ శ్రీ చినబాబు ఏర్పాటు చేసిన ఫోటో భీమవరం పట్టణ ప్రజల్ని విపరీతంగా ఆకర్షించింది. అందుకు ప్రధాన కారణం జనసేన పార్టీనాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లో స్థానిక ఎమ్మెల్యే ఫోటో ఉండడమే. ఫ్లెక్స్ చూసిన ప్రతి ఒక్కరూ అందులో
ఉన్న విషయాన్ని చదువుతుండడంతో అధికార పార్టీ నేతలకు వెన్నులో వణుకు మొదలయ్యింది. తరువాత బలవంతంగా ఆతొలగించటం కూడా జరిగింది.

వినూత్న ఆలోచనలతో, జనసేనాని అడుగుజాడల్లో సమస్యలు పరిష్కారానికి సేనాని, నాయకులు మరియు జనసైనికులు చేస్తున్న కృషి అభినందనీయం.