విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం జనసేన పోరాడుతుంది: ముత్తా శశిధర్

కాకినాడ సిటీ ఇంచార్జ్ మరియు జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం శుక్రవారం మొయిన్ ఆధ్వర్యంలో జగన్నాధపురంలోని జె రామారావుపేట ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ ఈ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీనారాయణ హిందూ స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల సందర్శించారు. అక్కడున్న స్థానికులు శశిధర్ తో మాట్లాడుతూ ఈ స్కూలులో గత సంవత్సరం మౌళిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని పనులు మొదలుపెట్టారనీ అవి ఇంతవరకూ పూర్తిచేయలేదని, ఇదే కాక దూరంలో ఉన్న మునిసిపల్ ప్రాధమిక ఉర్దూ స్కూలుని కలిపేసారని తెలిపారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ గత కొన్ని రోజులుగా తాను జనసైనికులు కలిసి రాష్ట్ర ప్రభుత్వ నాడు-నేడు కార్యక్రమం పరిశీలన చేపడుతున్నామని, వీటిని బేరీజు వేసుకుంటుంటే ఈ వై.ఎస్.ఆర్ ప్రభుత్వం తీరు చూస్తుంటే లెస్స్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ప్రయాణీకులకు చెప్పినట్టు తీరున స్కూళ్ళు మూసివేస్తూ, తగ్గించుకుంటూ విద్యారంగంపైన ఖర్చుని దండగలా భావిస్తూ నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని విమర్శించారు. దీనికితోడు స్కూళ్ళలో మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయడం పోలవరం ప్రాజక్టు తీరున సంవత్సరాల తరబడి తాత్సర్యం చేయడం ఈ వై.సి.పి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. పసిపిల్లలకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు, ఇలాంటి కారణాలవల్ల డ్రాపవుట్స్ పెరగవా మరి అని అంటూ విలీనం చేసిన ఉర్దూ స్కూలుని మళ్ళీ ప్రత్యేక ప్రాంగణంలో పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఈ రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని అంటూ రాబోయే నవతరమైన విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తు కోసం తాను, తమ జనసేన పార్టీ పోరాడుతామని తెలిపారు. స్థానికుల వినతులపై సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, జిల్లా సెక్రెటరీ అట్ల సత్యనారాయణ, సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ, సిటి ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, మాజీ కార్పోరేటర్ ర్యాలీ రాంబాబు, సిటి జాయింట్ సెక్రటరీ పెసంగి రాజేష్, వార్డు అధ్యక్షులు శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, నాయకులు అగ్రహారపు సతీష్, నందా, నరసిమ్హ కుమార్, సాయి కుమర్, చంద్రమౌళి, వెంకటేష్, ఇమ్రాన్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.