ఊపిరి ఉన్నంత వరకూ జనసేనలోనే ఉంటా: జే.ఎస్.పి గ్లోబల్ టీమ్ జూమ్ సమావేశంలో బత్తుల

  • జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో 14వ జూమ్ సమావేశం
  • పలు దేశాల నుండి జూమ్ సమావేశంలో పాల్గొన్న ఎన్నారై జనసేన నాయకులు మరియు వీరమహిళలు

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో ఆ టీమ్ ఫౌండర్ సురేష్ వరికూటి అధ్యక్షతన ఆదివారం రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణతో 14వ జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బత్తుల బలరామకృష్ణ దంపతులు జనసేన పార్టీని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళేందుకు అహర్నిశలు చేస్తున్న కార్యక్రమాలను శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల వివరించడం జరిగింది. దంపతులిద్దరూ నిత్యం ప్రజలతో మమేకమై ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి వారికి అండగా నిలబడతారని, బత్తుల బలరామకృష్ణ ఒక నియోజకవర్గాన్నే కాదు ఒక జిల్లాను ప్రభావితం చేయగల శక్తి అని, జనసేన పార్టీ సిద్ధాంతాలు అయినటువంటి పర్యావరణ పరిరక్షించే విధానంలో భాగంగా లక్ష మొక్కల పంపిణీ కార్యక్రమం చేసారని, మతాల ప్రస్తావన లేని రాజకీయంలో భాగంగా రంజాన్ పర్వదినాన 1200 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసారని, పార్టీని నిత్యం ప్రజలలోకి తీసుకెళ్ళేందుకు 100 రోజులు దాటి జరుగుతున్న జనంలోకి జనసేన మహాపాదయాత్ర – ఆడపడుచులకు బొట్టుపెట్టే కార్యక్రమం. రాజానగరం 3 మండలాలలో 3 అంబులెన్సుల ఏర్పాటు చేసి ప్రజలకి కావలసిన అత్యవసర సేవలను ఉచితంగా అందిస్తున్నారని, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసారని, రాజానగరం నుండి అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు – వారి కుమార్తె 2000 పైగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించారని, అనేక సమస్యలపై అలుపెరుగని పోరాటంలో భాగంగా ఇటీవల ఒక దళిత కార్మికుడు పనిలో ఉండగా చనిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేయగా బత్తుల బలరామకృష్ణ పోరాడి 7 లక్షల తక్షణ నష్టపరిహారం అందేలా చేసి వారి కుటుంబానికి అండగా నిలిచారని, బోన్ మేరోతో బాధపడుతున్న చిన్నారికి లక్ష రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధికసాయమందించారని, యువతను ప్రోత్సహించే విధంగా పలు క్రీడా టోర్నమెంటుల నిర్వహణ చేస్తున్నారని, తద్వారా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచుతున్నారని, ఇతర పార్టీల వారు బత్తుల సేవానిరతిని చూసి జనసేనలో చేరికలు భారీగా జరుగుతున్నాయని, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా పలు దేవాలయాలు చర్చ్ లు మరియు మస్జిద్ లకు ఆర్ధిక సహాయాలు అందజేసారు. 3 మండలాలో వేసవి తాపానికి పలు మజ్జిగ చలివేంద్రాల ఏర్పాటు చేసి ప్రయాణీకులకు, బాటసారులకు మరియు ఉపాధిహామి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేస్తున్నారని ఈ విధంగా బత్తుల దంపతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీలో చేరినప్పటి నుండి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం గ్లోబల్ టీం సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ తాను ఆర్మీలో సేవలందించానని తద్వారా చాలా నిబద్ధతతో ఉంటానని తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో జనసేనకు 35 శాతం ఓటింగ్ ఉందని దానిని మరింత పెంచే విధంగా నియోజకవర్గంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు 20 వేల కొత్త వోట్లను రెజిస్టర్ చేయించానని తెలిపారు. ఇంక మరిన్ని కొత్త ఓట్లను నమోదు చేయించే దిశగా పనిచేస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఎటువంటి దుశ్చర్యలకైనా పాల్పడతారని అందులో భాగంగా నియోజకవర్గానికి జనసేనకు చెందిన యువత ముఖ్యంగా కొత్తగా నమోదు చేయించుకున్న ఓట్లను 20 నుండి 30 వేల ఓట్లను గల్లంతు చేసే కార్యక్రమాలు జరుగనున్నాయని అదే జరిగితే చాలఆ ఇబ్బంది పడవలసి వస్తుందని దానిని నివారించేందుకు ఏ విధంగా కృషి చేయాలో కార్యాచరణ రూపొందించాలని అందుకు రాజానగరం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని తర్వాత ఇతర నియోజకవర్గాలకు కూడా అనువర్తించాలని ఎన్నారై నాయకులను కోరడం జరిగింది. అనంతరం అధినేత పవన్ కళ్యాణ్ తన అనుభవంతో ఎంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నారని అధినేత నిర్ణయమే మనకు శిరోధార్యమని, ఊపిరి ఉన్నంత వరకు జనసేనతోనే ఉంటానని, ఒకవేళ తను చనిపోతే ఆయనకు జనసేన జెండా కప్పాలని తెలిపారు. తన ప్రాంత అభివృద్ధే తనధ్యేయమని, ఆ అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యమని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు వస్తే ఆయన బస చేసేందుకు వీలుగా ఆయన అభిరుచికి తగినట్లుగా రాజమండ్రిలో నిర్మించిన కార్యాలయ పనులను దగ్గరుండి పర్యవేక్షించానని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే మనం సి.ఎం, సి.ఎం అంటే ముఖ్యమంత్రి అవ్వరని, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధిని మనం గెలిపించుకుంటేనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని దానికోసం జనసేన కార్యకర్తలు అందరూ నడుం బిగించి రోజుకు కనీసం రెండు గంటలు జనసేన కోసం పనిచేయాలని, అలా పనిచేసి జనసేన అభ్యర్ధులను గెలిపించుకుంటే తద్వారా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని కాబట్టి ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వారిని జనసేనకు ఓటు వేయవలసిందిగా కోరాలని తెలిపారు. ఈ విధంగా జరిగితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మనం 2024లో ముఖ్యమంత్రిగా చూడవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై జనసేన నాయకులు అందరూ మట్లాడుతూ బత్తుల మాటలు ఎంతో స్పూర్తినిచ్చాయని ఈ స్పూర్తితో మరింత ముందుకు వెళ్తామని తెలిపారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో యూకే, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, బెల్జియం మరియు జర్మనీకి చెందిన ఎన్నారై జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.