Prakasam: చదలవాడలో జనసేన విజయకేతనం

ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం చదలవాడ ఎంపీటీసీ 126 ఓట్లు మెజారిటీతో జనసేన పార్టీ అభ్యర్థి పమిడిముక్కల శివకృష్ణ విజయం సాధించారు. చదలవాడ గ్రామ ప్రజలు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చారు. ఈ విజయానికి కారణమయిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు వీర మహిళలకు హృదయ పూర్వక అభినందనలని, ఈ విజయం చదలవాడ గ్రామ ప్రజల విజయం, ఇదే స్ఫూర్తి తో రానున్న రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామగ్రామాన జనసేన జెండా ఎగురుతుందని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి సురేష్ తెలిపారు.