జనసేన మాటలు జనంలోకి

అనంతగిరి మండలం మొండి జాముగూడలో జనసేన పార్టీ జనసైనికుడు ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, సన్యాసిరావు, గేమ్మిలి ఆధ్వర్యంలో సుడిగాలిలా పర్యటిస్తూ, మొండి జాముగూడా గ్రామంలో పర్యటించి ఆయా గ్రామస్తులతో సమావేశమై సమస్యల మీద చర్చించారు. అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా, సన్యాసిరావు మాట్లాడుతూ జనసేన పార్టీ విధి విధానాలు, పార్టీ సిద్ధాంతాలు వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైయస్సార్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పాలని వారితో సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.