అభిమానాన్ని చాటిన జనసైనికుని కలిసిన జనసేనాని

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారే పంచప్రాణాలుగా భావించే జనసైనికుడు జనార్దన్ పవన్ కళ్యాణ్ కోసం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కొండ 635 మెట్లు మోకాళ్ళమీద మూడు సార్లు ఎక్కడం జరిగింది. మొదటిసారి కంటికి ఇన్ఫెక్షన్ అయ్యినప్పుడు, రెండవసారి ప్రజాపోరాట యాత్ర లో అభిమానులు బైక్ ర్యాలీలు చేస్తూ.. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోరాట యాత్ర విజయవంతం కావాలని మూడవసారి జనసేన పార్టీ విజయం సాధించాలని మోకాళ్ళమీద మెట్లు ఎక్కడం జరిగింది. అంతే కాదు జనార్దన్ జనసేన పార్టీ సభ్యత్వనమోదు, కొత్త ఓటు హక్కును కల్పించడం జనసేన పార్టీ తరపున ఓటునమోదు డ్రైవ్ నిర్వహించడం పార్టీ ప్రజల్లో బలోపేత దిశగా…పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున రక్తదానం కూడా చెయ్యడం ఈవిషయం జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిన వెంటనే ఆయన పార్టీ ఆఫీస్ కి పిలిచి ప్రేమగా మాట్లాడి అభినందించారు.