వల్లూరు రహదారి సమస్యపై స్పందనలో జనసేన ఫిర్యాదు

విజయనగరం: డెంకాడ మండలం, మోదవలస పంచాయతీ, వల్లూరు గ్రామానికి వెళ్లే రహదారిని మూసివేయడం జరిగింది. ఈ సమస్యపై స్పందన కార్యక్రమంలో సోమవారం జనసేన పార్టీ తరఫున విజయనగరం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మి లక్ష్మీ రాజ్ ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్, కృష్ణవేణి డెంకాడ మండల అధ్యక్షురాలు మోద వలస నాయకులు పైలా సురేష, ఎర్నింటి రమేష్, సూరిబాబు మండల సీనియర్ నాయకులు సూర్య ప్రకాష్, రాజారావు, శివ శంకర్, పైలా శ్రీను, భారతి, వల్లూరు జనసైనికులు వెంకటేష్, నరసమ్మ, రమేష్, అప్పలరాజు, శివ పాల్గొన్నారు. లెజెండ్ సమ్మేట్ అనే లేఔట్ ద్వారా ఉన్న ప్రస్తుతం ఈ రోడ్డు ఆదివారం రాత్రి మోదవలసలో కొంతమంది నాయకులు ఆ రహదారిని మూసివేశారు. వల్లూరు గ్రామస్తులు అందరు కలిసి సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి తమ యొక్క బాధని చెప్పుకున్నారు.