ప్రభుత్వ చెరువు కబ్జాపై ఆర్.డి.ఓ కు జనసేన ఫిర్యాదు

రామభద్రపురం మండలం, కొట్టక్కి గ్రామం నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న సర్వే నెంబరు 431లో 5 ఎకరాల ప్రభుత్వ చెరువు కబ్జా విషయమై ఆర్.డి.ఓ శేష శైలజకు జనసేన నాయకులు మహంతి ధనుంజయ మరియు బవిరెడ్డి మహేష్ వినతిపత్రం ఇవ్వటం జరిగింది. అక్రమ దారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆర్.డి.ఓ సానుకూలంగా స్పందించి ఎంక్వయిరీ జరిపిస్తానని తెలిపారు.