ప్రజా సమస్యలపై జనసేన పోరాటస్ఫూర్తి

  • ప్రజా సమస్యలపై జనసేన మీడియా సమావేశం

తుని నియోజకవర్గం: కోటనందూరు మండలం, బొద్దవరం గ్రామంలో ప్రజా సమస్యలపై అవగాహన కోసం జనసేన పార్టీ పోరాటస్ఫూర్తితో గ్రామ సమస్యల పరిష్కారం కొరకు గ్రామ జనసైనికులు సూరిసెట్టి అభిషేక్, అల్లవరపు సురేష్, మళ్ళ సాయి, మరియు జనసైనికుల ఆధ్వర్యంలో తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో భాగంగా బొద్ధవరం గ్రామంలో ఎన్నో ఏళ్ల నుండి నెలకొని ఉన్న సమస్య తాండవ నీటిపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని, గ్రామ ప్రజలు, రైతులు ఎన్నో ఏళ్ల నుంచి, ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తాం అని గత ప్రభుత్వాలు చెప్పడమే కానీ, కార్య రూపం లేదు.. స్మశానం సమస్యను జనసేన పార్టీ నాయకులు అంకారెడ్డి రాజా శేషు దృష్టికి తీసుకొని గ్రామ జనసైనికులు, మండల నాయకులు, గ్రామ ప్రజలు, గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు అందరి సమక్షంలో మీడియా సమావేశంలో చర్హించడం జరిగింది. ఇక్కడ తుని నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుని, బ్రిడ్జి నిర్మాణం, స్మశానం సమస్యను పరిష్కారం చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది అని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి, ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో కోటనందూరు మండల అధ్యక్షుడు పెదపాత్రుని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నక్క రామకృష్ణ, మండల జనసేన నాయకులు, అల్లు రాజబాబు, కాళ్ళ దొరబాబు, గంట దుర్గా ప్రసాద్, వడ్లమూరి ప్రసాద్, గొర్లి సతీష్, మురళి, రవి, రమణ, ప్రసన్న, కొరప్రోలు మణికంఠ, బొద్దవరం తెలుగుదేశం నాయకులు యల్లపు వెంకటరమణ, దొడ్డి శ్రీనివాస్, రాపేటి సంతోష్, వేగి నాయుడు, రైతులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.