వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే జనసేన లక్ష్యం

  • రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం
  • మర్రాపు సురేష్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు

గజపతినగరం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అలాంటి వ్యక్తిపైనే రెక్కీ నిర్వహించారంటేనే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధం చేసుకోవచ్చు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ చెత్త పాలన బయటకు వస్తుంటే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. పాలనలో లోపాలను ప్రజలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొస్తుంటే తట్టుకోలేక జగన్ తనలోని ఫ్యాక్షనిస్టుని నిద్ర లేపారు. పవన్ కళ్యాణ్ ని బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు. మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాటిని ఎదురొడ్డి నిలబడే వ్యక్తి. తెల్లదొరలను తరిమికొట్టడానికి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, మన్యం వీరుడు అల్లూరి ఎలాగైతే కంకణం కట్టుకొని పోరాటం చేశారో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకొని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి గుండాలు, రౌడీలను తరిమికొట్టే వరకు ఆయన పోరాటం ఆగదు. పోలీస్ వ్యవస్థ అంటే నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి కోసం పోలీసులు పనిచేస్తున్నారు. పోలీసు అధికారులకు మేము ఒకటే చెబుతున్నాం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రజల తరఫున, న్యాయం తరఫున నిలబడండి. పోలీస్ వ్యవస్థపై మా నాయకుడుకి, మాకు చాలా నమ్మకం ఉంది. దానిని నిలబెట్టేలా పనిచేయండి. పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలని ప్రయత్నించడం వైసీపీ నాయకుల అవివేకం. పవన్ కళ్యాణ్ ని టచ్ చేయాలంటే ముందు రాష్ట్రంలోని లక్షలాది మంది జనసైనికులను దాటుకొని వెళ్లాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. గుండాలు, రౌడీలు రాజ్యమేలుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలి. పవన్ కళ్యాణ్ కి రక్షణ కల్పించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణే జనసేన ధ్యేయం అని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే వైసీపీ నాయకుల గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి, తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగు రక్షణ కల్పించాలని శుక్రవారం గజపతినగరం పోలీస్ స్టేషన్లో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మిడతాన రవికుమార్, గజపతినగరం నాయకులు పండు, హరీష్, మహేష్, లక్ష్మణ, మహేశ్వరరావు, ప్రచార కమిటీ సభ్యులు కే.శ్రీను పాల్గొన్నారు.