ఇసుక అక్రమ రవాణాపై జగనాసుర 10 తలలతో జనసేన వినూత్న నిరసన

కోవూరు నియోజకవర్గం, మినగళ్ళు గ్రామం జిల్లాలో ఒక్కచోట కూడా అక్రమ తవ్వకాలు అనుమతి లేదని కలెక్టర్ పత్రికా ప్రకటన లెక్క చేయక యదేచ్ఛగా జిల్లాలో భారీ యంత్రాలతో పెద్ద పెద్ద ట్రక్కులతో తరలింపు. ఇసుక అక్రమ రవాణా ప్రశ్నిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కోవూరు నియోజకవర్గ, మినగళ్ళు వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకపక్క ఎన్జీటీ అనుమతులు ఉల్లంఘించి యదేచ్చగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఎవరూ పట్టించుకోకపోవడం తో పర్యావరణ విపత్తులను పట్టించుకోకుండా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ఒక మినగల్లులోనే జియో టాక్ ఒక స్థలంలో ఉండగా నాలుగు ప్రదేశాల్లో విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారు. అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నిస్తే సిబ్బంది దాడికి పాల్పడుతున్నారు. కలెక్టర్ చూస్తే జిల్లాలో ఎక్కడ అక్రమ తవ్వకాలు జరగటం లేదన్నారు. సంబంధిత అధికారులకు కాల్ చేస్తే అనుమతులు ఉన్నాయ్ అంటున్నారు కానీ అవి ఎక్కడ ఉన్నాయో తెలుపడం లేదు. గత నాలుగు రోజులుగా వస్తున్న కథనాలలో నిజం లేదు అక్రమ రవాణా ఇంకా జరుగుతూనే ఉంది అని చూపించే విధంగా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఈ సహజ వంతల విపత్తును గుర్తుచేస్తూ ఈ కార్యక్రమం చేపట్టామని, నది మధ్యలో అక్రమంగా తవ్వుతున్న ఈ ఇసుక అక్రమ రవాణా వల్ల నదుల ప్రవాహం దారి మళ్ళి గ్రామాల పరిస్థితి గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉన్నా లెక్కచేయకుండా విపత్తులను లెక్కచేయకుండా ఈ అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నాయకులను సార్వత్రిక ఎన్నికల్లో తరిమికొట్టాల్సిందిగా పిలుపునిస్తున్నాం. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమంగా దోచుకు తిరని వైసిపి పెత్తందారులు బలపడుతున్నారు. గ్రామాల నిధులు గల్లంతు చేయడమే కాకుండా గ్రామాలలో గుల్ల చేస్తూ విపత్తులకు కారణాలు అవుతున్న ఇసుక అక్రమ తవ్వాలని తవ్వకాలను వెంటనే ఆపాలి. అభివృద్ధి కాంక్షించి ప్రజా ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ని గెలిపించాల్సిందిగా పిలుపునిస్తున్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించి రావణ కాష్టంలా ఉన్న ప్రభుత్వాన్ని కాపాడాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,కోవూరు నియోజకవర్గం జనసైనికులు సాయి గౌడ్, సాయి, హేమచంద్ర యాదవ్, ప్రశాంత్ గౌడ్, మౌనిష్, కేశవ, కార్తీక్, శ్రీను, వర తదితరులు పాల్గొన్నారు.