రేషన్ బియ్యం పంపిణీ అవకతవకలపై జనసేన వినతి పత్రం

  • రేషన్ బియ్యం ఇవ్వకుండా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ.. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన జనసేన

పెందుర్తి నియోజకవర్గ, 88వ వార్డ్, నరవ గ్రామంలో సుమారు 250 కుటుంబాలకు రేషన్ బియ్యం, సరుకులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బాధిత కుటుంబాలు తరఫున శనివారం జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియా తో మాట్లాడుతూ నరవ గ్రామంలో ప్రతినెల రేషన్ సరుకులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బంది పెడుతుందని, ఈ నెలలో సుమారు 250 కుటుంబాలకు టైం అయిపోయింది కావున మీకు రేషన్ సరఫరా చేయలేమని కుంటి సాకులు చెబుతూ, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య అవగాహన లేకపోవడం వలన ప్రతినెల ప్రజల ఇబ్బంది పడుతున్నారు, ఒక్కొక్కసారి రేషన్ బియ్యం సరిపడినంత రావడం లేదని, మరొక్కసారి బియ్యం సరఫరా చేసే వాహనం ఉద్యోగులు అందుబాటులో లేరని, సర్వర్ డౌన్ గా ఉంది పనిచేయడం లేదని, డేట్ అయిపోయింది సర్వర్ పనిచేయదు అని కొంటెసాకులతో ప్రజలను ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ నూతన విధానం వలన ప్రజలుఇబ్బంది పడుతున్నారని, ప్రజలకు ఈ రేషన్ సరుకులు తీసుకోవడం కోసం పడిగాపులు కాస్తూ అర్ధరాత్రి సమయంలో కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారని, ఈనెల సుమారు 250 కుటుంబాలకు ఉద్యోగస్తుల మధ్య సఖ్యత లేకపోవడం వలన బియ్యం సరఫరా జరగలేదని వీటిపై ఆధారపడి జీవనం గడుపుతున్న పేద ప్రజలకు ఏవిధంగా బతకాలని. ఉన్నతాధికారులకు తెలియజేసిన వారు నుంచి ఏటువంటి స్పందన లేదని, వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అదీప్ రాజు, కార్పొరేటర్ ముత్యాల నాయుడు స్పందించి పేద ప్రజలకు బియ్యం సరఫరా అయ్యేలాగా కృషి చేయాలని, మీడియా ప్రతినిధులు కూడా ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి మిగిలిన కుటుంబాలకు న్యాయం జరిగేలాగా సహకరించాలని కోరడం జరిగింది. ఈ సమస్య పై స్థానిక వీఆర్వో శంకర్రావు వివరణ ఇస్తూ 250 కుటుంబాలకు రేషన్ ఇవ్వాల్సి ఉంది, చివరి తేదీ అయిపోవడం వల్ల సరఫరా చేయలేకపోయామని, రెండు రోజులు సర్వర్ పని చేయలేదని, రెండు రోజులు మాకు రావాల్సిన బియ్యం రాలేకపోవడం వల్ల సరఫరా చేయలేదని, మాకు ఈ సమస్య ప్రతినెలా వస్తుందని ఉన్నతాధికారులకు ఈ సమస్యను తెలియజేశామని వివరణ ఇవ్వడం జరిగింది. బాధిత మహిళలు మాట్లాడుతూ రేషన్ బియ్యంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మేము ఏ విధంగా బతకాలని, ఈ సమస్య ప్రతినెల మా గ్రామంలో ఏదో ఒక క్లస్టర్ లో ఉన్న ప్రజలకు ఈ సమస్య వస్తుంది, మూడు నెలల క్రితం కూడా ఇదే సమస్యపై మేము పోరాటం చేస్తే మాకు రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది అని, రేషన్ ఏ సమయంలో సరఫరా చేస్తారో కూడా మాకు తెలియడం లేదని, దీనికోసం పనులు మానుకొని పడిగాపులు కాయవలసి వస్తుందని, పాత పద్ధతే మాకు సౌకర్యవంతంగా ఉంటుందని, మాకు రేషన్ బియ్యం లేకపోతే ఈనెల ఏ విధంగా మా కుటుంబలు బతకాలని, ఓట్లు కోసం ఈ నాయకులు వస్తారే.. ఈ సమస్య పై ఎందుకు నాయకులు రావడం లేదు అని, ఈరోజు జనసేన పార్టీ ఉంది కాబట్టి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు, మూడు నెలల క్రితం కూడా మాకు జనసేన పార్టీ అండగా నిలబడడం వల్ల రేషన్ బియ్యం సరఫరా జరిగిందని మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో బొడ్డు నాయుడు, గవర శ్రీను, రాడీ పెంటారావు, ప్రసాద్, మరియు ప్రజలు పాల్గొన్నారు.