20 సంవత్సరాల్లో గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ?: పాలంకి సారధి

  • 16 కోట్ల నిధులతో గుడివాడ పాత కంకిపాడు రోడ్డు నిర్మాణ పనులు గాలికి ఎందుకు వదిలేశారు..
  • మాజీ మంత్రి కొడాలి నానిపై జనసేన నాయకుడు పాలంకి సారధి బాబు ఫైర్..

గుడివాడ: నియోజకవర్గ నాయకులు పాలంకి సారధి ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ కళాశాల వద్ద విజయవాడ రహదారి పక్కన ప్రమాదభరితంగా ఉన్న గుంతలో దిగి జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలంటూ, నినాదాలు చేస్తూ జనసేన పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు పాలంకి సారధి బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ చేతకానితనం, అధికారుల నిర్లక్ష్యం వల్ల విజయవాడ రహదారిలో ప్రమాదాలకు గురై అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదుల సంఖ్యలో వాహనదారులు మరణించిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, త్వరగతిన రహదారి నిర్మాణం పూర్తి చేయకుంటే జనసేన పార్టీ ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.. అదేవిధంగా గుడివాడ పట్టణంలో ఉండేటువంటి పలు రైల్వే గేట్లు వేస్తే గంటలు తరబడి వేచి ఉండటం వలన మహిళలు, విద్యార్థులు.. తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని స్థానిక ఎమ్మెల్యే సబ్వేలు వేద్దామన్న ఆలోచన ఏమాత్రం లేదని గుడివాడలో ఉండే వైసీపీ, టిడిపి పార్టీలు వర్ధంతిలు, జయంతులు, ర్యాలీల. మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై కనీస చిత్తశుద్ధి లేదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో.. కృష్ణా జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, స్థానిక నాయకులు. షేక్ రబ్బాని, గుడివాడ మణికంఠ, గంటా చైతన్య, అర్జా కృష్ణ, సాయినా నాని, వడ్డే గిరి, సూరిశెట్టి రాజబాబు, కొట్టే శివ, మోటేపల్లి రాంబాబు, మరియు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.