జనగామ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలపై జనసేన వినతిపత్రం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ సూచనల మేరకు.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ ఆదేశాల మేరకు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఆలేటి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జనగాం రైల్వే రైల్వేస్టేషన్ లో ప్రయాణికులు ఎదురుకుంటున్న సమస్యలు మరియు జనగామ రైల్వేస్టేషన్‌లో ఎంతో కాలంగా కోరుతున్న షిర్డీ, చార్మినార్‌తో పాటు గతంలో హాల్టింగ్‌ ఇచ్చి రద్దు చేసిన శాతవాహన రైలుకు హాల్టింగ్‌ ఇవ్వాలని. జనగామ వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు హాల్టింగ్‌ ఇవ్వాలని. వెంటనే కోచ్‌ డిస్‌ప్లే ఏర్పాటు చేయాలని. ఆదర్శ స్టేషన్‌గా అభివృద్ధి చేయడానికి రైల్వే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ తరపున రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, కేమిడి జాని, గాదె. వెంకటేష్, గందమల్ల అనిల్, బొట్ల రాకేష్, నాగరాజు, మంద పవన్ కుమార్, మంద వివేక్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.