ఆశావర్కర్ల సమ్మెకు జనసేన మద్దతు: డా. గంగులయ్య

అల్లూరీ జిల్లా పాడేరు: పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ టి డి ఏ) ఎదురుగా 36 గంటలు నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న గ్రామ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, ఆశావర్కర్లకు జనసేన పార్టీ తరుపున తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఆ పార్టీ పాడేరు ఇన్చార్జ్ గంగులయ్య తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ గా పనిచేసే మహిళలకు కేవలం 4 వేలు మాత్రమే జీతభత్యాలు పొందుతున్నారు. ఆశా వర్కర్లకు 10,000 జీతభత్యాలు పొందుతున్నారు. అయితే కార్మిక పని విషయంలో చూస్తే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కు, ఆశావర్కర్లు కి ఒకేరకమైన పని ఉన్నది. ప్రస్తుతానికి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ల ప్రధాన డిమాండ్ మమ్మల్ని ఆశా వర్కర్లుగా ప్రమోషన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశా వర్కర్లు మాకు శ్రమ ఘడియలు ఎక్కువగా ఉన్నందున మాకు 26వేలు జీతం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రమకు తగ్గ వేతనం పనికి తగ్గ ఫలితం కల్పించాలనే విధానంతో గురువారం. గ్రామ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, ఆశావర్కర్లు చేపడుతున్న36 గంటల నిరాహార దీక్షకు జనసేన పార్టీ సంపూర్ణాంగా మద్దతు ఇస్తుంది. ఆశావర్కర్లు, గ్రామ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ చేస్తున్న డిమాండ్లను సానుకూలంగా స్పందించి వారికి న్యాయం చేసేవిదంగా ప్రభుత్వం ఆలోచన చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి కార్మిక చట్టాలకునుగుణంగా కార్మికులకు కనీస వేతనం అమలు చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇలా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కార్మికులను శ్రమ దోపిడీ చేయడం తగదన్నారు. ప్రభుత్వం కార్మిక చట్టాలను ఉల్లంఘించి ప్రవర్తించడం మంచిది కాదన్నారు. జవాబు దారి విధానంలో భాగంగా ప్రభుత్వం కార్మికులకి, వారి సంక్షేమానికి సహకరించాలి కానీ ఇలా కంచె చేను మెసేలా వ్యవహరించడం తగదన్నారు. ఈ సందర్బంగా ఆశావర్కర్లు, గ్రామ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్లు చేస్తున్న నిరాహార దీక్షకి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డా. వంపూరు గంగులయ్య తెలిపారు.