అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి జనసేన చేయూత

ప్రత్తిపాడు, జనసేన పార్టీ కాకుమాను మండల కమిటీ మరియు పాండరపాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గత నెలలో పాండరపాడు గ్రామంలో ఎస్సి కాలనీలో కట్టా వీరయ్య పూరిల్లు అగ్నిప్రమాదంలో కాలిపోవటం జరిగింది. ఆ కుటుంబానికి జనసైనికులు మరియు నాయకులు 10,200/- రూపాయలు ఆర్ధిక సహాయం చేయటం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన నాయకులు చట్టాల త్రినాధ్, కూరపాటి నాగేశ్వరరావు, కాకుమాను మండల కమిటీ ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు రెడ్డి నాగరాజు, బుదే ఆనంద్ మరియు గ్రామ పెద్దలు పాల్గొనటం జరిగింది.