జనసేన గెలుపు ఖాయం: డాక్టర్ కందుల

విశాఖ, వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ దక్షిణ నియోజకవర్గం నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. బుధవారం ఆయన దక్షిణ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం అల్లిపురం కార్యాలయంలో నవ వధువు భవానికి బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేశారు. అదేవిధంగా నిరుపేద మహిళలకు రైస్ బ్యాగ్ తో పాటు నిత్యవసర సరుకులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అధికార వైసిపి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని దుమ్మెత్తి పోసారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎవరైనా నిలదీసి ప్రశ్నిస్తే ఆర్పే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులను ఏర్పడేలా చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజల తమ ఓటుతో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. జనసేన-టిడిపి కూటమి రాబోయే ఎన్నికలలో అన్ని నియోజకవర్గం మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, వరద శ్రీను, మోహన్, సత్యనారాయణ, గాజుల శ్రీను, బద్రి (సతీష్) శ్రీదేవి, గునుపూరు లక్ష్మి, బొద్దా లక్ష్మి, లలిత, దేవి, హేమ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.