జనసేనాని సేవా గుణానికి, మంచితనానికి జనసైనికులు అనుచరులు: గాదె

  • జనసైనికులు పార్టీకి మాత్రమే అనుచరులు కాదు.. పవన్ కళ్యాణ్ గారి సేవా గుణానికి, మంచితనానికి కూడా అనుచరులు.. గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలంలో ఉన్న చల్లవారిపాలెం గ్రామంలో నివసిస్తున్న మన్నేడి పుట్టారావ్ (ప్రవీణ్), జనసేన పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి అతనే ఆధారం. ఈ విషయం తెలుసుకున్న చల్లా వారి పాలెం గ్రామ జనసైనికులు అందరూ కలిసి 70,000/- వారి కుటుంబానికి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మార్కండేయ బాబు, నయబ్ కమల్ చేతుల మీదగా వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. జనసైనికులు పార్టీకి మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, మంచితనానికి కూడా అనుచరులు అని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అని తెలియజేశారు. ప్రతి జనసైనికుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాయుబ్ కమల్, మార్కండేయ బాబు, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, చట్టాల త్రినాధ్, సిరిగిరి శ్రీనివాసరావు, కొర్రపాటి నాగేశ్వరరావు, మధులాల్, చల్లా వారి పాలెం గ్రామ అధ్యక్షులు సుధా పిచ్చయ్య, సిరిగిరి వెంకట్రావు, పతేళ్ల నాగభూషణం, కొమ్మ గిరి, లీల కుమార్ మరియు గ్రామ జన సైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు పాల్గొన్నారు.