రైతులను ఆదుకోని టిఆర్ఎస్ ప్రభుత్వం..

  • రైతే రాజన్న కెసిఆర్ కనీసం రైతులను పట్టించుకునేదే లేదు..
  • 24 గంటల విద్యుత్ ను సరఫరా చేయాలి..
  • జనసేన మండల నాయకుడు రఘుమొహన్..

పర్వతగిరి మండలంలోని గోపన్నపెళ్లి గ్రామంలో రైతులను ఆదుకోని టిఆర్ఎస్ ప్రభుత్వతీరుపై జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన నాయకుడు రఘుమొహన్ మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్ ను అందిస్తామని మాయ మాటలు చెప్పి రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం రైతులకు కెసిఆర్ 24 గంటల విద్యుత్ ను ఇస్తున్నామని అంటూ చట్టసభలో పూటకో మాట చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అనుకుంటనే రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక 89 వేల కోట్ల నష్టాల్లో ట్రాన్స్కో నడుస్తుందని, అలాగే రాష్ట్రంలో ఏసీడి చార్జీల రూపంలో ప్రతి ఇంటికి అదనంగా రూ.1500-3000 వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తదితరులు పాల్గొన్నారు.