జనసేన ఆద్వర్యంలో జవాన్ నర్సింగరావు, నిర్మాత సంతోష్ లకు ఘన సన్మానం

శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం నియోజకవర్గం అరసవల్లి గ్రామానికి చెందిన జవాన్ నర్సింగరావు మరియు నిర్మాత సంతోష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క సేవా దృక్పదం, రాజకీయ విధానాలు, పార్టీ సిద్దాంతాలు, మేనిఫెస్టో, పవన్ కళ్యాణ్ ప్రజలపట్ల చూపుతున్న ఆదరాభిమానాలు నచ్చి తన వంతుగా పవన్ కళ్యాణ్ కీర్తిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని, నర్సింగరావు,(నిర్మాత సంతోష్) ఎంతో సమయాన్ని, ధనాన్ని వెచ్చించి, పవన్ కళ్యాణ్ కీర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా అత్యంత ప్రాధాన్యతతో కూడిన లిరిక్స్ వ్రాసి అత్యంత గొప్పగా పాటను వ్రాసి, పాడి జనసేన పార్టీకి అంకితం చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా ఆదివారం శ్రీకాకుళం జనసేన పార్టీ తరుపున అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సభ్యులు డాక్టర్ విశ్వక్సేన్ పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదల చైతన్య, ఎచ్చర్ల నియోజకవర్గ నాయకులు కాంతిశ్రీ, జీ సిగడం జడ్పీటీసీ అభ్యర్థి అర్జున్, శ్రీకాకుళం నాయకులు గురుప్రసాద్, ఉదయ్, సిద్దయ్య, ఆమదాలవలస నియోజకవర్గ నాయకులు కోరుకొండ మల్లేశ్వరావు, జన సైనికులు దుర్గారావు, రాజారమేష్, రాజేష్, సూర్య, శంకర్ సాయి, పవన్, తదితరులు పాల్గొన్నారు.