ముద్రగడపై నిప్పులు చెరిగిన కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: ముద్రగడ పద్మనాభం గారు దౌర్జన్యకారుడు. జగన్ బినామీ అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వెనుకోసుకొని రావడం నీచమైన, హేయమైన పనికిమాలిన చర్య. ఈ దృశ్చర్య వలన అపారకంగా గౌరవించిన కాపు కులమంతా నేడు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు, అసహ్యించుకుంటున్నారని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి మీడియా ముఖంగా నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ పవన్ కళ్యాణ్ గారిని కాపులు తరఫున ఉద్యమం చేయమని అడుగుతున్నారు. ఆయన కేవలం ఒక కులానికి చెందిన నాయకుడు కాదు?. మతాలకు, కులాలకు అతీతంగా భావితరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని స్థాపించి, రాజకీయాల్లో మార్పే ధ్యేయంగా… కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు సాగుతున్న వ్యక్తి. 2019 ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మెడ నుంచి ప్రత్యేక హోదా తెస్తాను, రైల్వే జోన్ సాధిస్తాను, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తాను.. ఇటువంటి అనేకమైన హామీలు ఇచ్చి ప్రజకు మాయ మాటలు చెప్పి నమ్మించి, ఓట్లు వేయించికొని కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్న మాట వాస్తవం కాదా?.. ఈ నాలుగేళ్ల కాలంలో పార్లమెంటులో ఏ బిల్లు పాసైన వైసీపీ ప్రభుత్వ సహకారం కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. ఈ అంశాలన్నీ బహిరంగ లేఖ ద్వారా ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు?. వారాహి యాత్ర మొదలై జనసేన పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న వేళ జగన్ రెడ్డి భయభ్రాంతులకు గురై ఓర్చుకోలేక నీలాంటి వారితో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయించడం చాలా విడ్డూరంగా ఉంది. కాకినాడ బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ కోణంలో విమర్శిస్తే.. మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?. మాకైతే అర్థం కావట్లేదు?. జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఆ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి విభేదాలు ఏర్పడతాయని దురుద్దేశంతో.. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కాపు నాయకులతో విమర్శలు చేయిస్తూ, కాపు కులంలోచిచ్చు రేపుతున్నాడు. ఈ మాత్రం మీకు అర్థం కావట్లేదా?. మీకు సమాజం పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా. వ్యవస్థ పైన నమ్మకం ఉన్నా మీరు బహిరంగ లేక ద్వారా పవన్ కళ్యాణ్ గారిని అడిగిన సమాధానాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగమని నీకు తెలియజేస్తున్నాం.