జనసేనాని నీపై పోటీకి దిగాలా?.. ద్వారంపూడిపై విరుచుకుపడ్డ జయరాం రెడ్డి

  • జనసేనాని మాటలకు ఆధారాలున్నాయ్

ద్వారంపూడీ నీ మీద జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలా? అంటూ అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు, లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి విర్చుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర నిర్వహిస్తోన్న వేళ ఆయనకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సవాళ్లు విసురుకున్నారు. దీనిపై కుంటిమద్ది జయరాం రెడ్డి మీడియా ముఖంగా స్పందిస్తూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి… మీ కుటుంబ సభ్యులకు దొంగ నోట్లతో సంబంధం లేదా?.. నీవు డికాయిట్ కాదా?.. నీవు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బినామీ కాదా?.. మీ దుర్మార్గాలకు, దురాగతాలకు కాకినాడ ప్రజలు బలి కావట్లేదా?.. నీవెంత? నీ బ్రతుకు ఎంత?. నీ మీద జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలా?, నీవు మీ కుటుంబ సభ్యులు వ్యవసాయం చేశారా?, వ్యాపారాలు చేశారా?.. ఇన్ని వేల కోట్ల సంపద!! ఎలా సంపాదించగలిగారు?. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ బహిరంగ సభలో మాట్లాడిన ప్రతి మాటకు ఆధారాలు ఉన్నాయి?. నీకు దమ్ము ధైర్యం ఉంటే చాతనైతే నేను పతితని అని నిరూపించుకో?. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన ఆలోచనలతో, వ్యవస్థల పైన పూర్తి అవగాహనతో, రాజకీయ చతురతో, ప్రాంతాలు, పరిస్థితులు పైన పూర్తి అవగాహనతో సరికొత్త రాజకీయ వ్యూహంతో మాట్లాడుతున్న మాటలకు మీ దగ్గర సమాధానం లేక.. వైసీపీ పెద్దలు నీకు స్లిప్ ఇస్తే.. ఆ స్లిప్పు ఆధారంగా మాట్లాడుతున్నావ్.. నీకు మీ నాయకుడి కుటుంబాలుకు నేర చరిత్ర, దోపిడీ, దొంగతనాలు చేయలేదని, మా కుటుంబాలు నీతివంతమైన కుటుంబాలని నిరూపించుకోండి? నీవు మీ నాయకుడు సొల్లు మాటలు ప్రజలకు చెప్పకండి? ఇంకా! ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు?. మీ ప్రభుత్వానికి ఇంకా 10 నెలల సమయం ఉంది, మీకు చాతనైతే, దమ్ము ధైర్యం ఉంటే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారని నిరూపించండి, లేదంటే కాకినాడ వీధులలో మా వీరమహిళలు మిమ్మల్ని పాదరక్షకులతో తరిమి తరిమి కొడతారని హెచ్చరిస్తున్నామని జయరాం రెడ్డి పేర్కొన్నారు.