జీవో నెంబర్ 52 రద్దు చేయాలి

  • ట్రైబల్ అడ్వెంచర్ కమిటీ టిఏసి జీవో నెంబర్ 52 రద్దు చేస్తూ గవర్నర్ పంపాలి
  • ఉత్తరాంధ్ర ఆదివాసి ఐక్య కార్యచరణ కమిటీ డిమాండ్

పార్వతీపురం, మన్యం జిల్లా ఆదివాసి భవనములో ఉత్తరాంధ్ర ఆదివాసి ఐక్య కారణచమిటి విలేకరుల సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు, మాట్లాడుతూ రేపు జరగబోయే టిఏసి కమిటీలో ఆదివాసి ఎమ్మెల్యేలు అంతా ఒక తాటిపై వచ్చి జీవో నెంబర్ 52 రద్దు చేస్తూ గవర్నర్ కు పంపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మి అప్పలరాజు దొర మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం బోయ వాల్మీకి మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నం చేస్తే ఆదివాసులంతా టిడిపి పార్టీని పాడికట్టి సముద్రంలో పడేసిన విషయం ఈ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిస్థితి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ.యోగి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 52 నిర్ణయానికి వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆదివాసులకు అన్యాయం చేస్తూ మీ రాజకీయ లబ్ధి కోసం కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని అంటే యావత్తు ఆదివాసి సంఘాలు ఉద్యమలు చేపడతాం. ఈ విషయంపై మిగతా రాజకీయ పార్టీలు నోరు విప్పకపోవడం ఆదివాసి ప్రజలకు గమనిస్తున్నారని రాబోయే 2024 ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇదే ప్రభుత్వం ఇదే విషయంయై నియమించి సర్వే చేయించిన జెసి శర్మ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దుక్క సీతారామ గిరిజన సమైక్య ఉత్తరాంధ్ర సహాయక కార్యదర్శి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 52 వెనక్కి తీసుకోకపోతే మన్యం బంధు చేస్తామని అలాగే గ్రామస్థాయిలో ఉద్యమం తీసుకువెళ్లి మరింత ఉద్యమం తీవ్రస్థాయిలో ఉద్యమం తీసుకువెళ్లి ఆదివాసి సమాజానికి అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిస్థిత్ సహాయక కార్యదర్శి బాబ్జి మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసుల అభివృద్ధి అందని ద్రాక్షగా ఉంటే ఈ ప్రభుత్వాలు వారి రాజకీయ లబ్ధి కోసం వారి ఉనికి చాటుకోవడం కోసం కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఆమె ఇవ్వడం చాలా దారుణమని నిజంగా ఈ ప్రభుత్వానికి ఆదివాసుపట్ల ప్రేమ ఉంటే ఆదివాసులు కేంద్రం విడుదల చేసిన కోట్ల నిదులపై కమిషన్ వేసి విచారణకు ఆదేశాలు చెయ్యేసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరిక చంద్రశేఖర్, గిరిజన సమైక్య సంఘం అధ్యక్షులు, పల్ల సురేష్ గిరిజన విద్యార్థి సంఘం, గణేష్, గౌరమ్మ, బాలమ్మ, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.