టాటా మెమోరియల్‌ సెంటర్‌లో ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ  టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టిఎంసి) లో నర్స్‌, టెక్నీషియన్‌, అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్‌ ద్వారా 126 పోస్టులను భర్తీ చేస్తారు. ఎండీ, డీఎన్‌బీ, బీటీ, జనరల్‌ నర్సింగ్‌ చేసినవారు ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు ముంబై, పంజాబ్‌లోని రీజినల్‌ సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 126

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 12, రేడియాలజీ అసిస్టెంట్‌ 1, ఐటీ హెడ్‌ 1, డిస్పెన్సరీ ఇన్‌చార్జ్‌ 1, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ 2, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ 1, జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) 1, అసిస్టెంట్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ 4, నర్స్‌ 102 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు రుసుం: రూ.300. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనక్కరలేదు. నవంబర్ 29వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు  https://tmc.gov.in/ అనే వెబ్ సైట్ ను సంప్రదించాలి.