యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు రాజంపేట మున్సిపాలిటీ 7వవార్డుకు సంబందించిన నలబైఎనిమిది కుటుంబాలకు చెందిన యువకులు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్దాంతాలు, శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు యల్లటూరు శ్రీనివాస రాజు పట్టుదల, ఆయన పార్టీ అభివృద్ధికి చేస్తున్న కృషికి నచ్చి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, పివిఆర్ కుమార్, బాలసాయి, ఆకుల చలపతి, ప్రశాంత్, పూల మురళి తదితర జనసేన శ్రేణులు పాల్గొన్నారు.