పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరికలు

పోలవరం నియోజకవర్గం: జీలుగుమిల్లి మండలం, తబిసివారిగూడెం గ్రామంలో మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్ధాంతాలు నచ్చి సుమారు 60 కుటుంబాలు పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు సమక్షంలో పార్టీ కండువా అందుకున్నారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి స్వాగతం చెబుతూ గ్రామానికి రోడ్డు ఎంతో అవసరం అని, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులు గిట్టుబాటు ధర రావాలన్నా, మనతోపాటు అందరూ అభివృద్ధి చెందాలన్నా జనసేన టిడిపి పార్టీలు అధికారంలోకి రావడం చాలా అవసరమని, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ, మండల, గ్రామ సమస్యలు పట్టించుకోకపోవడం మన గిరిజనులు 30 ఏళ్లు వెనక్కి పడిపోయిందని, అభివృద్ధి లేదని, జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసి మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కర్రిపోతుల రాజకుమార్, మండల కార్యదర్శి సతీష్ రెడ్డి, చందు, జానకిరామ్, వీరమహిళ హిమబిందు, కాకా వెంకటేశ్వరావు వగ్గెల ప్రసాద్, కూరం పరమేశ్వరావు, లీలావతి, పూసం చంటమ్మా తదితరులు పాల్గొన్నారు.