మంగళమిట్టలో “జనంలో జనసేన”

  • రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో రాజంపేట మండలంలో “జనంలో జనసేన” కార్యక్రమం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం మంగళమిట్టలో “జనంలో జనసేన” కార్యక్రమంలో బాగంగా జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు మరియు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు “గాజు గ్లాస్”ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కట్టారు బాబు, రాచగుల్ల నవీన్, సుహాన్, రమేష్, యాసిన్, బాబ్జి, శ్రీను, నాని, శ్రీకాంత్, సురేష్, బాబి, అహ్మద్, సిద్దిక్, రెడ్డయ్య, నాగరాజ, మహేష్. రాజంపేట జనసేన నాయకులు శింగంశెట్టినరేంద్ర, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్‌, పత్తి నారాయణ, రాందాసు రామచంద్ర, భీమినేని రమేష్, కట్టారు బాబు, చల్లా మధు, పత్తి నారాయణ, మౌల, రఫీ, కె.ఆర్, కడవకూటి సుధాకర్, నాని తదితరులు పాల్గొన్నారు.