హిందూపురం జనసేనలో చేరికలు

హిందూపురం నియోజకవర్గం, చిలమత్తూరు మండలం, వీరాపురం పంచాయితీకి చెందిన 50 కుటుంబాలు మండల అధ్యక్షుడు చిన్నా ప్రవీణ్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు అగ్గి శీన ల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము, జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, సీనియర్ నాయకుడు మల్లెపూల మధు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చిలమత్తూరు మండల నాయకులు అంజి, శివ, లక్ష్మణ మూర్తి, మనోహర్, హరి, కిరణ్, రంగనాథ్, మరియు రవితేజ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.