చిన్న సారవ గ్రామంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం, చిన్న సారవ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు చింతపల్లి కనకరాజు, చింతపల్లి రామచంద్రరావు, చింతపల్లి త్రిమూర్తులు, గుబ్బల నాసీరు, చింతపల్లి రామకృష్ణ, చింతపల్లి రాంబాబు, చింతపల్లి చిట్టిబాబు, గుత్తుల సురేష్ మరియు దాదాపుగా 50 మంది కటకంశెట్టి సంజీవరావు, కంచర్ల ఫణికర్ మరియు ఫణికుమార్ ల ఆధ్వర్యంలో మరియు టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.