వరదయపాలెంలో జనసేనలో చేరికలు

సత్యవేడు నియోజకవర్గం, వరదయపాలెం మండలం, ఆదివారం వరదయపాలెం మండల అధ్యక్షులు అంబటి చిరంజీవి యాదవ్ అధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కేశవ్ అధ్యక్షతన కురింజాలం పంచాయితీ & గ్రామం నుంచి జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ లావణ్య కుమార్ మాట్లాడుతూ అధికార పార్టీ వాళ్లు పథకాల ప్రచారం పైన పెట్టిన శ్రద్ధ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో శ్రద్ధ పెట్టలేక పోయారు, ప్రభుత్వ దగ్గర సిద్ధం పోస్టర్లు వేయడానికి నిధులు ఉంటాయి కానీ రోడ్లు బాగా చేయడానికి నిధులు ఉండవు. మద్యపానం నిషేధం అని చెప్పి కల్తీ మద్యం విచ్చలవిడిగా రాష్ట్రం మొత్తం జగన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అమ్ముతున్నాడు. దళితుల భూములను అక్రమంగా లాక్కుంటున్నారు. ఇవి ఆగాలంటే జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థిని గెలిచాలని చెప్పడం జరిగింది. మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అందరిది ముఖ్యంగా దళితుల పార్టీ అని, జగన్ రెడ్డి రాక్షస పాలన చేస్తున్నాడు మనం బగుండాలి అంటే జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థిని గెలిచాలని చెప్పడం జరిగింది. కులశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పోలవరం గురించి అడిగితే జగన్ పెళ్లిళ్లు గురించి మాట్లాడుతున్నాడు ఇలాంటి వ్యక్తి మనకు సీఎంగా అవసరమా, ఈ అరాచక ప్రభుత్వని గద్దె దించి ప్రజ ప్రభుత్వాన్ని మనమంతా గెలిపించుకోవాలి జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థిని గెలిచాలని చెప్పడం జరిగింది. మండల ఉపఅధ్యక్షుడు దేవళ్ళ తులసి రామ్ మాట్లాడుతూ జనసే పార్టీ తరుపున బూత్ స్థాయిలో బలంగా పనిచేయాలని జనసైనికులకు చెప్పడం జరిగింది. ప్రధాన కార్యదర్శి కేశవ్ మాట్లాడుతూ వ్యూహం పవన్ కళ్యాణ్ ది, గెలుపుకంటే కూడా మెజార్టీ ముఖ్యమని, సత్యవేడు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని పవన్ కళ్యాణ్-చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలని తెలియజేసారు. ప్రధాన కార్యదర్శి యంపళ్ళ వెంకటేష్ మాట్లాడుతూ జగన్ రెడ్డి రౌడీ పాలన చేస్తున్నాడు ఉచిత పథకల పేరిట ప్రజలను మోసం చేస్తూ కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలు తీస్తూ, ఇసుక దోపిడీలు చేస్తున్నాడు, వ్యూహం పవన్ కళ్యాణ్ ది, గెలుపుకంటే కూడా మెజార్టీ ముఖ్యమని, సత్యవేడు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని పవన్ కళ్యాణ్-చంద్రబాబు నాయుడులకు బహుమతిగా ఇవ్వాలని తెలియజేసారు. మండల అధ్యక్షుడు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడ ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం, మండల నాయకులు, కార్యదర్శి వినోద్, సంయుక్త కార్యదర్శి యుగంధర్, ప్రసాద్, పృధ్వి, రజిత్ కార్యకర్తలు కుపయ్య, చరణ్, లోకనాధం ఇతరులు, అభిమానులు తదితరులు నాయకులు పాల్గొన్నారు.