మాడుగులలో జనసేన పార్టీలో చేరికలు
మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం, వీరవిల్లి అగ్రహారం గ్రామంలో మహా శివరాత్రి పర్వదినాన వీరవిల్లీ అగ్రహారం గ్రామ యువకులు మొగ్గా శ్రీనివాస్ మరియు మొగ్గా దివాకర్ లను మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ గారి చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ముందుగా వారికి పార్టీ యొక్క సిద్ధాంతాలను మరియు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను, అధికార పార్టీ వైఫల్యాలను మరియు పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఐతే జరగబోయే పరిపాలన ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు వివరించి.. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేయాలని చెప్పి వారినీ జనసేన పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ వీర మహిళ గుమ్మడి రేవతి, మాడుగుల మండల పరిధిలోని గల జనసైనికులు మరియు వీరవిల్లి అగ్రహారం గ్రామ జన సైనికులు పాల్గొన్నారు.