కారవాక గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపిల ఉమ్మడి ప్రచారం

మామిడికుదురు మండలం, కారవాక గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీలు బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ మరియు అమలాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జనసేన, టీడీపి, బీజేపీ మండల అధ్యక్షులు మొల్లెటి శ్రీనివాస్, దొడ్డ జయరామ్ అధ్వర్యంలో సమావేశంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు చిరకాల వాంఛ ఎన్నో ఏళ్లుగా పూర్తి కాని బ్రిడ్జి నిర్మాణం, బీసీ డిక్లరేషన్ గురించి, అగ్నికులక్షత్రియ సామాజిక వర్గం పడుతున్న ఇబ్బందులు, సొసైటి భూములుపై హక్కులు, ప్రజా సమస్యలు త్రాగు నీరు, డ్రైనేజ్ సమస్య, కరెంటు రోడ్లు, సమస్య, తదితర సమస్యలు తెలుసుకుని. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్దికి గాజు గ్లాసు ఎంపీ అభ్యర్ధికి సైకిల్ గుర్తుపై తమ అమూల్య మైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఉమ్మడి అభ్యర్ధి దేవ వరప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపి, బీజేపీ పార్టీల రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.