“నా సేన కోసం నా వంతు” కో- కన్వీనర్ రుక్మిణి కోటతో జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం

  • జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో 8వ జూమ్ సమావేశం

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో ఆ టీమ్ ఫౌండర్ సురేష్ వరికూటి అధ్యక్షతన జనసేనపార్టీ “నా సేన కోసం నా వంతు” కో- కన్వీనర్ రుక్మిణి కోటతో ఆదివారం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్యలక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీం” నుండి వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి జనసేనపార్టీ “నా సేన కోసం నా వంతు” కో- కన్వీనర్ రుక్మిణి కోటతో ఎన్నారై జనసేన నాయకులు వివిధ అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా రుక్మిణి కోట మాట్లాడుతూ “నా సేన కోసం నా వంతు” అనేది మనమే కాదు గతంలో ఇతర దేశాలలోను మరియు దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా పార్టీలను నిర్మించి తద్వారా ప్రభుత్వాలను స్థాపించి ప్రజలకు స్వచ్ఛమైన ప్రజాపాలనను అందించిన దాఖలాలు చూసామని అన్నారు. జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ నిర్వాహకులు సురేష్ వరికూటి మాట్లాడుతూ “నా సేన కోసం నా వంతు” లో ఎక్కువమంది భాగస్వామ్యమయ్యేలా మరింత ప్రభావితం చేసేలా కృషి చేద్దామని తెలియచేయటం జరిగింది. “నా సేన కోసం నా వంతు” అనేది ఒక క్రౌడ్ ఫండ్ మాత్రమే కాదు, ముఖ్యంగా ప్రజల్లో ఒక నినాదాన్ని తీసుకువెళ్లడం జనసేన పార్టీ ద్వారా నవసమాజం నిర్మాణానికి ప్రతి సామాన్యుడు 10 రూపాయల నుంచి ఎంతైనా అమౌంట్ వారికి వీలయినంత పార్టీకి విరాళం అందించడం ద్వారా వాళ్ళకి పార్టీ మీద మరియు సమాజం మీద ఒక బాధ్యత వస్తుందని పిలుపునిచ్చారు. ప్రస్తుతం “నా సేన కోసం నా వంతు” కి డొనేట్ చేస్తున్న వారిని ఉత్సాహపరిచేలా పార్టీ నుంచి ప్రతి ఒక్కరికి గుర్తించేలా ధన్యవాదముల మెయిల్ ఒకటి పంపితే బాగుంటుందని వీర మహిళలు మరియు జనసైనికులు రిక్వెస్ట్ చెయ్యటం జరిగింది. రుక్మిణి కోట చివరగా ఈ మీటప్ లో తీసుకొన్న సూచనలు, సలహాలు పార్టీకి అందచేసి అమలుపరిచేలా కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో జర్మనీ నుండి సురేష్ వరికూటీ, రంగ దాసరి, యూకె నుండి శ్రీని ధర్నాల, వడ్రాణం నాగరాజు, చంద్ర, అమల చలమశెట్టి, పద్మజ రామిశెట్టి, బాల నల్లి, సేషేల్స్ నుండి రమేష్ సెపేన, కెన్యా నుండి ప్రవీణ్ మొగసాటి అండ్ టీం, యుఎస్ నుండి శేఖర్ పిల్లా, న్యూజిలాండ్ నుండి సాయిరాం తోట, వెంకట గోపాలకృష్ణ, సాయికృష్ణ, బెల్జియం నుండి ప్రవీణ్ జరుగుమల్లి, స్వీడన్ నుండి సాంబశివ మొఖమాటం, సౌత్ కొరియా నుండి నాగ వంశీకృష్ణ తిరుమలశెట్టి, డా.ప్రవీణ్ రాయల్ పాల్గొనడం జరిగింది.