నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని స్వంతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్‌) లో జూనియర్ అసిస్టెంట్‌, సీనియర్ అసిస్టెంట్‌, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చేనెల 15 నుంచి ప్రారంభమవుతాయని, ఆగస్టు 14 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

మొత్తం పోస్టులు: 42

ఇందులో జూనియర్ అసిస్టెంట్ 30, సీనియర్ అసిస్టెంట్ 8, జూనియర్ అకౌంటెంట్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హతలు: సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్‌ పోస్టులకు డిగ్రీ తోపాటు, ఎన్‌బీఈ నిర్వహించే పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ పాసై ఉండాలి. కంప్యూటర్స్‌, విండోస్‌, ల్యాన్ అర్కిటెక్చర్ గురించి తెలిసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా. (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌)

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: జూలై 15

దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 14

సీబీటీ పరీక్ష: సెప్టెంబర్ 20

వెబ్‌సైట్‌: www.natboard.edu.in