అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి: బొర్రా

సత్తెనపల్లి, అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాద్యులు బొర్రా వెంకట అప్పారావు అన్నారు. తాలూకా సెంటర్లో ధర్నా చేస్తున్న అంగన్వాడీలకు బొర్రా మద్దతు తెలిపారు. ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరించలేదు కాబట్టి మీరు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి అన్న మాటల్లో వాస్తవం ఉంది. నేను ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నాను, నా దగ్గర పనిచేసే కార్మికులకు కూడా సమస్యలు ఉన్నాయి. వారి కష్టాలు వారి సమస్యలు నాకు తెలుసు కాబట్టి వారి తరుపున నుండి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అన్ని పనులు ముగించుకొని ఉదయం 9 గంటలకు వచ్చి, పిల్లల్ని అన్ని విధాలుగా బాగా, తల్లి కన్నా ఎక్కువగా చూస్తున్నారు అంగన్వాడీలు. గర్భిణీలకు కూడా మంచి ఆహారం అందించి తల్లి బిడ్డ ఆరోగ్యం ఉండటానికి కృషి చేస్తారు. సమాజానికి ఎన్నో విధాలుగా అంగనవాడి టీచర్లు ఉపయోగపడుతున్నారు. కనీసం జీతం లేకుండా, రోజుకు 300, 400 వందలు రూపాయలు ఇస్తే, వాళ్లకి ఎలా సరిపోతాయి. జీతం పెంచమని అడిగితే, ప్రభుత్వం మీకు ఒళ్ళు బలిసిందా..? అహంకారం ఎక్కిందా..? అని మాట్లాడుతున్నారు వారు మాత్రం లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. సమాజానికి ఉపయోగపడే ఎన్నో పనులు వాళ్ళు చేస్తారు వాళ్ల జీతాలు పెంచాలి. మహిళలను దృష్టిలో పెట్టుకొని వారు అడిగే న్యాయమైన కోరికలను నెరవేర్చాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు సత్తెనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు బత్తుల కేశవ, జనసేన నాయకులు గట్టు శ్రీదేవి, చిలక పూర్ణ, చిలక సత్యం, ఖాసీం తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.