యోగభారతి ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా జ్యోతుల శ్రీనివాసు

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజవర్గం, యోగభారతి ఫౌండేషన్ రిజిష్టర్ నెంబరు:29/2022. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా జ్యోతుల శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శిగా మేకల కృష్ణ నియమించడం జరిగింది. యోగభారత్ ఫౌండేషన్ గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జిల్లాస్దాయిలో వ్యవస్దస్దాపక చెర్మన్ జ్యోతుల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు అధ్వర్యంలో పని చేసేది. జిల్లా స్థాయిలో జ్యోతుల శ్రీ‌నివాసు ఆర్దికసహయంతో అనేక ప్రాంతాలలో యోగ శిక్షణ తరగతులు నిర్వహించారు. తద్వారా జ్యోతుల శ్రీనివాసు మంచి గుర్తింపు పొందారు. కాని కరోనా కారణంగా భ్సౌతికంగా యోగ క్లాసుల నిర్వహణకు అవకాశం లేని కారణంగా 2020వ సంవత్సరం నుండి జూమ్ యాప్ ద్వారా క్లాసులను నిర్వహిస్తూన్న తరుణంలో యోగభారత్ పౌంఢేషన్ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విస్తరించి జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ ద్వారా యోగ క్లాసులను నిర్వంచడం జరుగుతుంది. యోగభారతి పౌంఢేషన్ రాష్ట్ర, కేంద్ర, స్థాయి కార్యవర్గాలు నియమించబడ్డాయి. అందులో భాగంగా పూర్వపు తూర్పుగోదావరి జిల్లా యోగభారతి పౌంఢేషన్ అధ్యక్షులైన జ్యోతుల శ్రీనివాసును రాష్ట్రాధ్యక్షులుగా నియమించారు, యోగభారతి ఫౌండేషన్ అభివృద్ధికి తగు సలహలు, సూచనల అందిస్తూ యోగాను అభ్యసిస్తున్న మేకల కృష్ణను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగినది.