వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం అందించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలుమండలం, చిన జగ్గంపేట గ్రామానికి చెందిన గంటా దుర్గ దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతుంది. విషయం తెలిసిన చినజగ్గంపేట గ్రామ జనసైనికుల ద్వారా జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసుకు గంటా దుర్గ ఆనారోగ్యవిషయం తెలియజేయగా, స్పందించిన జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు మంగళవారం సమయంలో గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేట గ్రామానికి వెళ్లి గంట దుర్గను కలిసి ఆమె అనారోగ్యవిషయం గురించి ఆమెను అడిగి తెలుసుకుని ఆమెకు వైద్యం చేయించుకోనే నిమిత్తం నగదును, 25 కేజీల బియ్యం, కిరాణా సామాన్లు ఆమెకు జ్యోతుల శ్రీనివాసు సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో గాది చిన్నప్పారావు, జనసైనికులు సత్తెనపల్లి గోవిందు, నక్కా శ్రీను, సత్తెనపల్లి లొవరాజు, నక్కా కిరణ్, తాటిపర్తి గ్రామజనసైనికులు గాడిదల బుజ్జి, పాశం గోవింద్, మేడిపోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతారాంబాబు, జ్యోతుల శివశంకర్, మేడిపోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.