తుఫాను బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేసిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం, తుఫాను కారణంగా గొల్లప్రోలు నగరపంచాయతీ పరిధిలో జగనన్న కాలనీ, సూరంపాలెం, హరిజనపేట కాలనీలలో వరదనీటితో ముంపుకు గురైన బాధితులకి ఆహారం 500 కుటుంబాలకు జనసేన నాయకులు జ్యోతులశ్రీనివాసు, జనసేన నాయకులు, జనసైనికులు అందజేయడం జరిగింది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా పిఠాపురం నియోజకవర్గం నందు గొల్లప్రోలు నగర పంచాయతీ జగనన్న కాలనీ నీటితో మునిగిన కారణంగా జగనన్నకాలనీ పూర్తిగా జలమయ్యింది. దీంతో ప్రజలకు రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పాడడం కారణంగా జగనన్నకాలనీ వాసులు నిత్యవసరవస్తువులు,కనీసావసరాలు తీరని పరిస్థితి ఏర్పడింది.అదేవిధంగా ఏలేరు ఆయుకట్టునీరు, ఒట్టిగెడ్డ ఆయుకట్టు కాల్వల నుంచి వచ్చే మిచౌంగ్ తుఫాన్ వరదనీరు కారణంగా జగనన్న కాలనీలో వరదనీటి బాధితులకు సహాయక చర్యలు చేపట్టడానికి కూడా తీవ్రమైన ఆటంకం ఏర్పడిన పరిస్థితుల్లో ఎడ్ల బండిలపై వెళ్ళి గొల్లప్రోలు నగరపంచాయతీకి చెందిన జనసేన నాయకులు, జనసైనికులు మరియ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కలిసి గొల్లప్రోలు నగరపంచాయతీ చెందిన జగనన్న కాలనీ మిచౌంగ్ తుఫాన్ బాధితులకు ఆహార పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ళ పేరుతో జగనన్న కాలనీలు అని అట్టహాసంగా ప్రసారం నిర్వహించిందే తప్ప, జగనన్న కాలనీలకు సంబంధించిన రోడ్ల నిర్మాణంగానీ, జగనన్న కాలనీకి వెళ్లే దారులకు బ్రిడ్జిని నిర్మాణం గాని, కనీసం వసతులు చేపట్టలేదని పంటపొలాలు అని తెలిసి కూడా వసతులు కేటాయించాలేదని, నిరుపేదలైన పేదవారు ఎటువంటి ఇంటి వసతి లేనివాళ్ళు ఆయా ఇళ్లస్థలాల్లో ఇల్లును నిర్మించుకుని ఉంటున్న సందర్భంలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా జగనన్న కాలనీ పూర్తిగా జలమయం అయినది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా గడిచిన మూడు రోజుల నుంచి వారు బయటకు వెళ్ళి ఉపాధి, కూలీ పనులు లేని కారణం కనీసం నిత్యాసర వస్తువుల్ని బయట నుంచి తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడినది. వారికి ఆహారకొరత, తాగునీరు కొరత ఏర్పడింది. ఈ కొరతను గుర్తించిన జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జనసైనికులు కలిసి తగిన ఆహర ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ఇప్పటికైనా నగరపంచాయతీకి జగనన్నకాలనీకి మధ్యలో ఉన్నటువంటి కాలువపై బ్రిడ్జినిర్మాణం చేసి జగనన్నాకాలనీవాసులకు బయటసమాజంతో వారికి వరదలు సమయంలో మనవసంబంధాలు ఏర్పాటు చేయమని ఇందుమూలంగా రాష్ట్రప్రభుత్వాన్ని జ్యోతుల శ్రీనివాసు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు నాయకులు బలిరెడ్డి గంగబాబు, పర్ల రాజా, అనిశెట్టి నూకరాజు, తలారి శ్రీనివాసు, బుడంకాయల దోరబాబు, తలారి దోరబాబు, గరగ తాతాజీ, గుండ్రా శ్రీను, మాదేపల్లి వెంకట సత్యనారాయణ, జ్యోతుల విజయ్, వీరబాబు(లక్కి), సిద్దా సింహాద్రి, తోగర పాపిరాజు, చక్కల శివ, కర్రి దొరబాబు, కర్రి వంశీ, కొండేపూడి శివ, గొల్లపిల్లి తేజ, వెంకటేష్, దుర్గాడ గ్రామ జనసేన నాయకులు మెడిబోయిన సత్యనారాయణ, సకినాల రాజు, కొల్లు వీరబాబు, వానపల్లి మణికంఠ, చేసెట్టి భద్రం, మంతిన గణేష్, శాఖ సురేష్, జీలకర్ర భాను, కోలా నాని, విప్పర్తి శ్రీను, పొలం గణేష్ తదితరులు పాల్గొన్నారు.