నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన జ్యోతుల

పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో రాష్ట్ర పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ నెల 18, 19 తేదీలలో తూర్పుగోదావరిజిల్లాలో పర్యటనలో భాగంగా ప్రమాదశాత్తు మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాదభీమా చెక్కులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాకినాడ ముత్తా క్లబ్బులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జ్యోతుల శ్రీనివాసు హాజరై అనంతరం రాష్ట్ర పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ని పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు.