ఉదారగుణం చాటుకున్న కడిమి శ్రీనుబాబు

కొవ్వూరు: జనసేన పార్టీ ధర్మవరం గ్రామ అధ్యక్షులు కడిమి శ్రీను బాబు ఉదారగుణం చాటుకున్నారు. ఆయన గురువారం కొవ్వూరు మండలం, ధర్మవరం గ్రామంలో ప్రమాదవశాస్తూ రెండుకాళ్ళు పోగుట్టుక్కున్న రమణను పరామర్శించి, ఆయనలో కుటుంబాన్ని పోషించే ధైర్యాన్ని నింపి పచారి కొట్టు పెట్టించారు. ఈ సందర్భంగా కడిమి శ్రీనుబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ అందరికి అండగా ఉంటుందని, జనసేన పార్టీ తరుపున ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్తామని గ్రామ అధ్యక్షులు కడిమి శ్రీనుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, జనసేన నాయకులు చౌటపల్లి శివ, మండల సంయుక్త కార్యదర్శి కాపకాయల సతీష్, యానాల నాగేంద్ర, దార్ల ప్రసాద్ తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.