ఆచార్య సినిమా షూటింగ్‌లో కాజల్ దంపతులు సందడి.. కొత్త జంటకు మెగాస్టార్ శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక తాజాగా ఆచార్య సెట్‌లో కొత్త జంట కాజల్ దంపతులు సందడి చేశారు. అక్టోబర్ 30న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్‌లో కాజల్ తన స్నేహితుడు గౌతమ్‌ని వివాహం చేసుకోగా తాజాగా ఆచార్య షూటింగ్‌లో జాయిన్ అయ్యారు కాజల్.

కాజల్ దంపతులకు సినిమా యూనిట్ బొకేలతో స్వాగతం పలికారు. కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు కొరటాల శివ, డీఓపీ తిరు సహా పలువురు కాజల్‌, గౌతమ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.