దక్షిణ కోయంబత్తూర్ బరిలో కమల్‌ హాసన్

చెన్నై: మక్కల్ నీధి మైయమ్ (ఎంఎన్ఎం) చీఫ్ కమల్‌హాసన్ దక్షిణ కోయంబత్తూర్‌ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఎంఎన్ఎం శుక్రవారంనాడు ప్రకటించింది. 234 అసెంబ్లీ స్థానాల్లోనూ భాగస్వామ్య పార్టీలతో కలిసి కమల్‌హాసన్ పోటీ చేస్తున్నారు. 154 స్థానాల్లో ఎంఎన్ఎం పోటీ చేయనుండగా, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలైన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే), ఇందియ జయనాయగ కట్చి చెరో 40 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్‌హాసనేనని ఏఐఎస్ఎంకే చీఫ్ శరత్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. చెన్నై నుంచి కమల్ హాసన్ పోటీ చేయనున్నట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి.