కాపు నేస్తం వేదికపై సీఎం వ్యాక్యలను ఖండించిన కామిశెట్టి రమేష్

  • కాపులపై జగన్ రెడ్డిది కపట ప్రేమ కాపులు మోసపోయారే తప్ప అమ్ముడు పోయేవారు కాదు.
  • కాపులకు ఈబీసీ రిజర్వేషన్ తొలగించిన ద్రోహి జగన్
  • కాపు కార్పొరేషన్ కు ఏటా ఇస్తామన్న రూ. 2 వేల కోట్లు ఏమైయ్యాయి?
  • కాపు సంక్షేమానికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయండి
  • కాపులు అమ్ముడుపోతారని సీఎం మాట్లాడుతుంటే వేదికపై ఉన్న కాపు నాయకులకు పౌరుషం రాలేదా?

మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్

కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.2 వేలు కోట్లు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కాకి లెక్కలను పక్కన పెట్టి, గత మూడేళ్లలో కాపులకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ పథకాలకు ఇచ్చిన నిధులన్నీ కాపుల కోటాలో చూపిస్తూ.. మోసం చేయడం మానుకొని, కాపులకు ఈ ప్రభుత్వం చేసిన అసలైన లబ్ధిని చూపించాలన్నారు. ఈబీసీ కోటాలో కాపులకి ఉన్న రిజర్వేషన్ తొలగించి కాపు జాతికి ద్రోహం చేసింది శ్రీ జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. కాపు మంత్రులను కేవలం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని, వారికి మరే పనీ ఉండదు అని తెలిపారు.

ఈ ప్రభుత్వ తీరు.. బటన్ నొక్కితే అద్భుతాలు జరిగిపోతాయని భావిస్తున్న ఈ ముఖ్యమంత్రి, కాపు కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాని నుంచి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. కనీసం కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ ఎవరో కూడా సగటు కాపులకు తెలియని పరిస్థితిలో వున్నారని. కాపులు అమ్ముడుపోతారు అని అవమానిస్తుంటే వేదిక మీద ఉన్న కాపు నేతలకు పౌరుషం రాలేదా?.. అని దుయ్యబట్టారు, కాపు సామాజిక వర్గంతో.. పాటు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, ఇకనైనా ఇలాంటి మాటలు మానుకొని కాపులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.