కందరాడ సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొన్న పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: తన సొంత స్వగ్రామమైన కందరాడ గ్రామంలో ఆదివారం వెలసినటువంటి గ్రామదేవత సత్తమ్మ తల్లి జాతర మహోత్సవంలో కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అమ్మవారిని దర్శించుకుని జాతర నిమిత్తం అమ్మవారికి 5116/- రూపాయలు విరాళంగా అందించడం జరిగింది అనంతరం జాతర మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాకపల్లి సూర్య ప్రకాష్, మాస పెద్దపుత్రయ్య, మాట్టాడ దుర్గ బాబు, వాకపల్లి శ్రీను, బొండాడ జయరాజు, కట్టు శ్రీను, లండ నాని, మరియు గుడి కమిటీ జనసైనికులు పాల్గొనడం జరిగింది.